ఈనేపథ్యంలో తెలంగాణ నుంచి మోడీ కేబినెట్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి పదవుల రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు నిరాకరిస్తే.. రాష్ట్రం నుంచి ఎవరికి చోటు కల్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన కె.లక్ష్మణ్‌లు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. దీంతో వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. వీరిలో కె.లక్ష్మణ్ ఇప్పటికే పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు మంగళవారం ఎంపీ సోయం బాపురా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరిగితే తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది
Read More:
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?
0 Comments